
Contributed by Karthik Mellachervu
అరేయ్, ఒరేయ్, మామ, మచ్చా (తమిళ్ మామ), బాబాయ్, బావ, డ్యూడ్, బడ్డి ఒక్క relationship కి ఎన్ని పేర్లో..
మనకి ఉండే closesness బట్టి పిలిచే స్టయిల్ మారిపోతుంది మరీ క్లోజ్ అయితే “ఏంది బే” అనేంత(అదో పిలుపు).
అదేదో మన సొంతోడి లాగా ఏమాత్రం ఫార్మాలిటీస్ లేకుండా ఎలా పిలిచినా.. పలుకుతూ ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుకో గలిగె ఒకే ఒక్క మహా మనిషి అదే మన దోస్త్ గాళ్లు.
అస్సలు ఫ్రెండ్స్ గురించి ఒక్క పాటలో చెప్పాలంటే
“ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలుస్తాము….
“పుట్టినదగ్గర నుంచి ఏదో ఒక రకంగా మన లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు.
స్కూల్లో చడ్డి దోస్తులు అదే అండి బాల్య స్నేహితులు aka చిన్ననాటి స్నేహితులు, తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీసులో ఫ్రెండ్స్ ఇంక పెళ్ళి అయ్యాక ఫ్యామిలీ ఫ్రెండ్స్, అదృష్టం ఉంటే జాన్ జిగిరి జబ్బా దోస్తు గాళ్లు – బెస్ట్ ఫ్రెండ్స్.
పెరుగుతున్న కొద్దీ ఫ్రెండ్స్ మారుతారేమో కాని ఫ్రెండ్షిప్ మాత్రం మారదు.
ఇంక ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే మాత్రం ఈ పాట మాత్రం కచ్చితంగా పాడాల్సిందే అదే
” స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం….”
Realize అవ్వం కాని మనం మనతో బాటే మన స్నేహం కూడా పెరుగుతూ పోతుంది.
ఎన్నేళ్ళు వచ్చినా వాళ్ళతో మాట్లాడుతుంటే మాత్రం టైమ్ మెషిన్ ఎక్కకుండా ఆ మెమోరీస్లోకి వెళ్లిపోయి
“అబ్బో ఆ రోజుల్లో భలే చేసాము రా…”
అంటూ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ మనసులో ఎగిరి గంతులేసుకుంటాము.
ఎప్పుడైనా మీరు observe చేశారా ఒక వేళ వాళ్ళతో మాట్లాడి కొన్ని సంవత్సరాలు అయినా కాని ఫోన్ ఎత్తగానే
” ఏరా ఎలా ఉన్నావు …” అని అడిగేయగలము.
ఒకప్పుడు కలం స్నేహం అని ఒక హాబీ ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడో మిస్ అయిన ఫ్రెండ్స్ maximum ఒక మెసేజ్ దూరంలో దొరుకుతూ ఈ వరల్డ్ ఇస్ సో స్మాల్ అన్నట్టు చేసేసింది.
మొన్న chichchore మూవీ చూసాను అందులో హీరో 20-30 years తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ నీ కలవాల్సి వస్తుంది.ఇంకేముంది FB లో వెతక గానే దొరుకుతారు ఇంక అక్కడ్నుంచి వాళ్ళ గాంగ్ అందరిని కలుస్తాడు. వాళ్ళు అందరూ కలిసిన సిట్యుయేషన్ మాత్రం కొంచం బాధగా ఉన్నా వాళ్ళ స్టోరీ మాత్రం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకళ్ళను ఒకళ్ళు ఎలా inspire చేసుకుంటారో చూపించిన విధానం చాలా బాగుంది.
సినిమా లోనే కాదు మన లైఫ్ లో కూడా మనకు తెలియకుండా మనతో ఉంటూ మనల్ని ఏదో ఒక రకంగా inspire చేస్తుంటారు.
ఎప్పుడైనా మీరు sanskrit చదివారా??
ఆ లాంగ్వేజ్ స్పెషల్ ఏటంటే ఒక ఆబ్జెక్ట్ కి దాని లక్షణాల బట్టి అదేనండి ప్రాపర్టీస్ నీ బట్టి పిలుస్తారంట. Dittiko డిట్టో ఈ దోస్త్ గాళ్ళ మద్యలో కూడా అంతే ముద్దు గా మన పరెంట్స్ పెట్టిన పేరు ఒక్కడూ పిలవడు వాళ్ళ convience ప్రకారం పిలుస్తారు అరేయ్ పొట్టోడా, అరేయ్ పొడుగొడా, అరేయ్ మామ్మ (ఒక ఫ్రెండ్ గాడి ఊత పదం), అరేయ్ <వాడు వచ్చిన కంట్రీ పేరు>, అరేయ్ body ( ఒక కండల కాంతారావు పేరు), అరేయ్ గొట్టం ( స్మోకింగ్ is ఇంజురీస్ to హెల్త్), అరేయ్ < వాడు వచ్చిన కంట్రీ పేరు>, అరేయ్ సైంటిస్ట్ (ఒక మంచి ఇంటెలిజెంట్), అరేయ్ బిత్తిరి (వాడికి భయం ఎక్కువ) ఇలా పెట్టడంలో వాళ్ళకు వాళ్ళే సాటి. ఇంక ఆ గ్రూపులో ఇద్దరు ముగ్గురు ఒకటే పేరు ఉంటే మాత్రం గుర్తు పెట్టుకోటానికి మనకో బిరుదు తగిలిచేస్తారు.
మనకు general గా డాక్టర్ దగ్గరికి ఏమి దాచొద్దు అని అంటారు వాళ్ళు మనకున్న ఇబ్బంది బట్టి మనకి వచ్చిన ఇష్యూ ఎంటో అర్ధం చేసుకుంటారు కొన్ని సార్లు మొహమాటం కొద్ది అయ్యినా చెప్పాల్సి వస్తుంది కాని ఫ్రెండ్స్ దగ్గర ఏ మొహమాటం లేకుండా ఏ దాపరికాలు లేకుండా కొన్ని సార్లు మనకేమన్న ఇబ్బంది ఉంటే చెప్పేసుకుంటాము.
మన అదృష్టం బాగుంటే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది లేదంటే మన గోడు అంతా వాడికి చెప్పుకొని రిలాక్స్ అవుతాము …
ఎక్కడో చదివాను As per Human phycology “మనం బాధల్లోనో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సొల్యూషన్ ఎంత ఇంపార్టెంటో ఆ బాధ చెప్పుకోవటానికి ఒక మనిషి కూడా అంతే ఇంపార్టెంట్” అందుకే ఏదైనా పంచుకుంటే తగ్గిపోతుంది అంట.. అలా పంచుకొగలిగే ఒకే ఒకడు ఫ్రెండ్ గాడు..
“A FRIEND IN NEED IS A FRIEND INDEED”
ఇలాంటి ఎన్నో మెమోరీస్, Inspirations, సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికి Happy Friendship Day చెప్పుకుంటూ మళ్లీ కలుద్దాం..