Home stories అవని

అవని


Contributed by Kanukurthi Sai Kiran

నా బాధని చెపుదాం అని నాన్న దగ్గరకి వెళ్ళాను నన్ను చూడగానే ఏం ముఖం పెట్టుకొని? మళ్ళీ నా ఇంటి గడప తొక్కుతున్నావ్ ? బుద్ది ఉండాలి తప్పు చేసి నా ఇంటికి రావడానికి.

అయినా నా కూతురు ఎప్పుడో చనిపోయింది నన్ను, నా మాటని కాదని వెళ్లిన రోజే నా కూతురు పోయింది. “ఆ మాటలకి తప్పు నాదే అని తెలిసిన సరిదిద్దుకోలేని సందర్భం నాది”.ఇదంతా గమనిస్తున్న మా అన్న తండ్రి చాటు బిడ్డగా ఉండిపోయాడు.గంభీరంగా వెళ్ళిపో అన్నాడు నాన్న….
ఆ మాట కి బాధకి మరింత బాధ తోడైంది.
బరువైన హృదయంతో నడక సాగిద్దాం అనుకుంటే నా దప్పిక తీర్చడానికి 3 మైళ్ళలో ఒక్క బోరు బావి కానరాలే సరిగ్గా తిండి తిని 4 రోజులైతుంది. పుట్టెడు శోకంతో పురిట్లో ఉన్న బిడ్డ బతుకుతాడా? లేదా? అన్న సందిగ్ధం. నా కోసం కాకపోయినా బిడ్డ కోసం అడుగు వేద్దాం అన్న నా కోరిక ఫలించేనా భగవంతుడా….
నా మోర ఆలకించరా అంటూ సొమ్మసిల్లి నేలకొరిగింది అవని …
కొన్ని గంటల తరువాత
మేలుకవతో కనులు తెరిచిన తల్లి లేచి చూసే వరకు వృద్ధాశ్రయంలోని
మెడికల్ వార్డులో ఉంది
అవని : నేను ఎక్కడ ఉన్నాను?
బయపడకండి మీరు మీ బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇది “శ్రీ మాతృమూర్తి దేవి వృద్ధాశ్రమం” ఇదిగో ఈ డాక్టర్గారే మిమల్ని Check చేసి చూసారు ఇక నుండి మీరు ఇక్కడే ఉండిపోవచ్చు.
“మీ అందరికి జీవితాంతం ఋణపడి ఉంటా అమ్మ” అని దణ్ణం పెట్టింది అవని.
మరో మూడు రోజులో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది అవని పేరు కూడా ఆమెని రోడ్ మీద పడిపోయినప్పుడు సాయం చేసిన ఆ తల్లి పేరు పెట్టింది.
అలా అవని అదే వృద్ధశ్రమంలో పిల్లలని ఒంటరి చేసిన తల్లిదండ్రులకి బిడ్డ అయి సేవలందిస్తూ అక్కడే ఉంది.తన కూతురు మంచిగ చదువుతూ తన ఆశయానికి అనుకూలంగా అడుగులేస్తోంది.
కానీ అవనికి ఎప్పుడు ఓ ఆలోచన బాధిస్తూ ఉండేది
నేను ఓ తండ్రికి కూతురుగా ఉండలేకపోయా?
ఓ తల్లి దగ్గర నుండి పుట్టింటి సారెకు నోచుకోలే?
కడవరకు తోడుంటాడు అనుకున్న భర్త మోజు తీరగానే మోసం చేసి వెళ్లిపోయాడు?
ఇక నా బ్రతుకు ఎందుకు అనే కాంక్షకి నే మోసే బిడ్డే నా భవిష్యత్తు అని ఆగిపోయాను?
ఇన్నిటిలో నాకంటూ జరిగిన ఆనందపు సంఘటనలు అంటే ఈ ఆశ్రమంలోనే.
అవని తలుపుకేసి చూస్తూ ఆలోచిస్తుంది
అయ్యో అదేంటి మా నాన్నలా ఉన్నాడే? ఏంటి ఇటు వైపు వస్తున్నాడు? అదిగో అమ్మ కూడా వస్తుంది?వాళ్ళని చూడగానే నా దుఃఖం ఆగలేదు వెంటనే వెళ్లి వాళ్ళని హత్తుకొని రోదిస్తుంది అవని.
నాన్న, అమ్మ ఎం జరిగింది? ఎందుకు ఇలా మీరు ఇక్కడికి ఎం జరిగింది చెప్పండి? నాన్న చెప్పండి?
అమ్మ నువ్వైనా చెప్పు అమ్మ అని బరువైన గుండెతో అడిగింది అవని.
బిడ్డ మీ ఒక్కగానొక్క అన్న, వదిన మా ఇద్దరినీ ఆ ఇంటికి భారమయ్యాము అని రోడ్ మీద పడేసారు.నా కడుపులో వాడిని నవ మాసాలు మోసిన కూడా నాకు అంత భారంగా కనిపించలేదు కానీ వాడు ఈ రోజు మాట్లాడుతున్న మాటలకి భరించలేక వచ్చాము బిడ్డ.నిన్ను ఆ రోజు వెలేసినప్పుడు దిక్కు లేకుండా పోతది? అనుకున్నాము కానీ ఈ నాడు తెలియని లోకానికి నువ్వే దిక్కయినావు బిడ్డ అని రోదించింది తల్లి. అవని తల్లిదండ్రులనీ తీసుకోని వెళ్లి ఒక గది చూపించి వాళ్ళని మంచిగా ఏలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది.
తన బాధలో తొలి రెండు ఈ విధంగా వాళ్ళకి సేవ చేస్తూ గడుపుతుండగా.ఒక రోజు News Paper లో తన భర్త అరెస్ట్ అని వచ్చింది. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ వీళ్ళు కాళ్ళ మీద పడి భర్త మీద పడిన దొంగతనం కేసులో విడిపించి తనని కూడా తీసుకోని వృద్దశ్రమం వచ్చింది.అవనికి ఆ నాటి నుండి ఎదో మూలాన జరిగిన చెడు సంఘటనలు కూడా వాళ్ళని ఏకం చేసాయి. వాళ్ళందరూ అదే ఆశ్రమంలో ఆ పని, ఈ పని చేసుకుంటా నేల వారి జీతంతో జీవితాన్ని సాగిస్తున్నారు.
ఒకటి రెండు,సార్లు వాళ్ళ అన్నకి నచ్చచెపుదాం అని చూసిన ఫలితం లేకుండా పోయింది.కొన్నాళ్లకి తండ్రి అనారోగ్యంతో మరణిచాడు చుట్టం చూపుగా వచ్చి తండ్రికి తల కొరివి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ పని కూడా చేయకపోయి ఉంటే నా ఆవేశానికి వాడిని కూడా ఆ మంటల్లో దహిస్తానేమో అనిపించింది.కొన్నాళ్లకి వారి ఆశయానికి అనుకూలంగా ఆ బిడ్డని మంచిగా చదివించారు.తను కొలువు కూడా తెచ్చుకుంది.
ఒక అమ్మ :
తండ్రికి బిడ్డ కాకపోయినా తండ్రినే చివరి వరకు కొడుకుగా చూసింది.
ఆకలి తీర్చిన అమ్మకి మరో జీవితాన్నిచ్చింది.
వదిలేసినా భర్తని, బ్రతిమాలి విడిపించి, నిలిపింది.
పుట్టుకకి నోచుకుంటదో, లేదో? అన్న బిడ్డ కొలువు సంపాదించి కోవెలయింది.
అన్నగా కాదు కదా బంధానికే కూడానోచుకోని వాడిని వెలేసి చూపింది.
ఇది అవని శక్తి మాత్రమే కాదు
ఓ తల్లి గెలుపు
ఆడపిల్ల ఇంటికి అవసరం కాదు ఆదర్శం.

సృష్టికి అమ్మ ఆలయం అయితే ఆమె చూపే ప్రేమయే దీవెనై దీవిస్తుంది

Load More Related Articles
Load More By ohmanasa-admin
Load More In stories