
Contributed by Hari Atthaluri
“దీపం లేని రాత్రి”
దెయ్యం ని పుట్టించింది…
“సమాధానం లేని ప్రశ్న”
దేవుడు ని పుట్టించింది..
“తెలివి లేని బుర్ర”
ఆ రెండు అంటే భయం ని పుట్టించింది..
“అలాంటి భయాలు లేని బుర్ర”
ధైర్యం ని పుట్టించింది…
“ఉన్నది ఉన్నట్టు చెప్పలేని సందర్భం”
సర్దుకుపోవడం ని పుట్టించింది…
“అలా ఎదురు తిరగలేని బ్రతుకు”
బానిసత్వం ని పుట్టించింది..
“ఆ బానిసత్వం ని భరించలేని ఆలోచన”
విప్లవం ని పుట్టించింది..
“పని లేని పొద్దు”
పుకార్లు ని పుట్టించింది..
“వాటిలో ఏది నిజమో తెలుసుకోలేని విచక్షణ”
అనుమానం ని పుట్టించింది..
“మనం అని అనుకోలేని బుద్ధి”
స్వార్థం ని పుట్టించింది
“ఆ స్వార్థం ని నేరుగా చెప్పలేని దౌర్భాగ్యం”
మోసం ని పుట్టించింది
“అది మోసం అని తెలుసుకోలేని అలసత్వం”
నమ్మక ద్రోహం ని పుట్టించింది..
“ఈ నమ్మక ద్రోహం తట్టుకోలేని మనసు”
పగ ని పుట్టించింది,
“తట్టుకున్న మనసు“
క్షమాగుణం ని పుట్టించింది ..
“నువ్వు లేని నేను లేను అనే భావన”
ప్రేమ ని పుట్టించింది..
“ఆ ప్రేమ ని పొందలేని పిచ్చి”
పైసాచికత్వం ని పుట్టించింది…
“ఆపలేని ఓ ఆలోచన”
కోరిక ని పుట్టించింది
“అనుకున్నట్టు అవ్వలేని ఆ కోరిక”
బాధని పుట్టించింది..
“ఆ బాధ ని తట్టుకోలేని కాలం”
ఆవేదనని పుట్టించింది
“అలా అర్ధం లేని ఆవేదన”
దిగులు ని పుట్టించింది..
“ఇలా దిగులుతో పోరాడలేని ఊహ”
ఆత్మహత్య ని పుట్టించింది..
“అసలు ఇలాంటి ఆవేదన ఏం లేని ఆలోచన”
ఆనందం ని పుట్టించింది..
“ఇంకొకరి గొప్పని తట్టుకోలేని స్వభావం”
అసూయ ని పుట్టించింది..
“దేనికీ లోటు లేని జీవితం”
అహం ని పుట్టించింది…
“ఉన్న వాటిని మార్చలేని నిస్సహాయత”
విధి ని పుట్టించింది
“ఎవ్వరినీ ఏం అనలేని బలహీనత”
మంచితనం ని పుట్టించింది..
“అర్దం చేసుకోలేని మనస్తత్వం”
మూర్ఖత్వం ని పుట్టించింది
“ఏం తెలుసుకోవటానికి ప్రయత్నించని అలవాటు”
అమాయకత్వం ని పుట్టించింది
“వివరం ఎంటో తెలుసుకోలేని ఉత్సాహం”
అవివేకం ని పుట్టించింది..
“పూర్తిగా ఏది తెలుసుకోలేని తొందర”
అపార్థం ని పుట్టించింది
“అది అపార్థం అని గుర్తించలేని తత్వం “
కోపం ని పుట్టించింది…
“అలా ఆది లోనే తుంచలేని కోపం”
ద్వేషం ని పుట్టించింది…
” ఇలా ఎంతకీ ఆపుకోలేని ద్వేషం”
ఓ శత్రువు ని పుట్టించింది..
“ఆ శత్రువు ఉనికి కూడా తట్టుకోలేని తత్వం”
పాపం చేయటం ని పుట్టించింది..
“అలా అడ్డూ ఆపూ లేని ఆ పాపమే’
మన వినాశనం ని పుట్టించింది..
అర్థం చేసుకోవాలే కానీ…
ఇలా తరచి చూస్తే.
మన పుట్టుక కి….
కాలం తో పాటు మనలో పుట్టే ప్రతీ ఆలోచనకి, వెనక ఓ కారణం ఉంటుంది…
అది అర్ధం ఐతే సగం నిన్ను నువ్వు గెలిచినట్టు..
మనిషి గా ఓ మెట్టు పైకి ఎక్కుతున్నట్టు..