
Contributed by Hari Atthaluri
నా జీవితం లో..
అతిధులే కానీ ఆగిపోయిన వాళ్ళు లేరు…
దగ్గరగా వచ్చారు కానీ
అది దాటి ముందుకు రాలేకపోయారు…
ఉన్నారు కానీ ఉండి పోలేకపోయారు…
అర్ధం చేసుకున్నా కాబట్టే ఆపలేకపోయాను..
విన్నాను కాబట్టే ఒంటరి గా మిగిలాను..
మనుషులు మధ్య దూరం ఎంత తగ్గినా..a
మనసుల మధ్య దూరం అంతో ఇంతో మిగిలే ఉంటుంది…
లేదు అనుకునే ఆ చిన్న దూరమే ఒక్కోసారి..
ఒకరిని ఒకరికి కాకుండా చేస్తుంది..నరకం చూపిస్తుంది…
మోసం అనలేను..
మోసపోయా అని చెప్పలేను..
మాట జారలేను..
అలా అని జరిగింది అంతా మర్చిపోలేను…
నా అంత కాకపోయినా వాళ్ళది కూడా..
అంతో ఇంతో బాధే అని అర్థం చేసుకోగలను…
సరేలే అని నా బాధ ని..ఆ బాధ వల్ల పెరిగిన నా గుండె బరువుని..
ఉండే ఈ నాలుగు రోజులు మోసేద్దాము అని మెంటల్ గా ఫిక్స్ ఐపోయాను…
రోజూ లేస్తున్నాను, పడుకుంటున్నాను…
కానీ రోజంతా..
ఈ రోజు ఐనా నాకు గతం గుర్తుకు రాకుండా ఉంటే చాలు అనుకుంటూనే గతాన్ని గుర్తు చేసుకుంటున్నాను….
ఇలా ఐతే కుదరదు అని మనసు ని మెల్లగా మభ్య పెడుతున్నాను..
మాటల్ని మాయం చేసి..
నాలోని నన్ను ఓ మూగబోయిన మనిషి గా చేస్తున్నాను..
అలా మౌనం గానే, నాలో దిగులు ని నేనే గెలుస్తున్నాను…
ప్రేమ వేరు..జీవితం వేరు.
జీవితం జీతం తీసుకోకుండా పాఠాలు చెప్తుంది… గుర్తుంచుకోక పోతే బాగా గుర్తుండి పోయేలా కొన్ని గుణపాఠాలు కూడా చెప్తుంది…
అప్పటి నా గతం నాకో గుణ పాఠం…
ఐనా ఒకరు నాకు దూరం అవ్వటం అంటే నేను ఓడిపోయినట్టు కాదుగా…
చిన్నప్పుడు నాన్నే ప్రపంచం అనుకున్నా..
పెరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ యే ప్రపంచం అనుకున్నా
బాధ్యత తెలిశాక చదువే ప్రపంచం అనుకున్నా.
తర్వాత తనే నా ప్రపంచం అనుకున్నా…
టైమ్ తో పాటు నా priorities అన్నీ మారిపోయాయి..
“అలా ఆ టైమ్ నా చుట్టూ ఉండే నా అనుకునే నా ప్రపంచాన్ని ప్రతీ సారి మార్చేస్తూ వచ్చింది”
ఇపుడు తను సడన్ గా వెళ్ళిపోతే అది శూన్యం ఎందుకు ఐపోతుంది ? నా టైమ్ ఎందుకు ఆగిపోతుంది…
తన ముందు..తన తర్వాత కూడా నాకంటూ ఓ ప్రపంచం ఉంది కదా ??? సర్వం కోల్పోయినట్లు ఇంకా ఈ sad feelings ఎందుకు ???
గాయం నా మనసుకి కి కానీ..
నేను చేరుకోవాల్సిన గమ్యం కి కాదు గా !
బాధ నాది కానీ..
నా బాధ్యత గా చేయాల్సిన వాటిది కాదు గా !!
అక్కడే ఆగిపోతే…నేను సాధించాల్సింది నన్ను వెతుక్కుంటూ రాదు గా !!
ఇలా అనుకుంటూ…
మళ్లీ భవిష్యత్ గురించి ఆలోచించటం మొదలు పెట్టాను..
మెల్లగా అన్నీ మర్చిపోయే రోజు ఒకటి వస్తుంది అనే ఆశతో…
మళ్లీ నేను మామూలు గా ఉంటా అనే నమ్మకం తో..