
By Chaitanya
శీతాకాలం తరువాత,
వసంత కాలం మళ్లీ వచ్చినప్పుడు,
నేను నీతో ఉంటాను,
ఇంకోసారి వికసించే పుష్పాలను చూసేందుకు…
అందమైన సూర్యుడు అస్తమించినప్పుడు,
వాతావరణం దుర్భరంగా మారినప్పుడు,
నేను నీతోనే ఉంటాను,
మౌనంగా నిన్ను కాపాడేందుకు,
నీ పక్కన నీ దైర్యం కోసం నిలబడుతూ…!
ఒక తుఫాను తరువాత,
వాతావరణం అంతా ప్రశాంతంగా మారుతున్నప్పుడు,
నీతో నేను ఉంటాను,
వర్షించే చినుకులు నీ ముఖంపై తెచ్చే చిరునవ్వును చూసేందుకు….!
వాతావరణం దుర్భరంగా ఉన్నా కూడా,
నీ చుట్టూ ఒక కవచంలా నేను ఉంటాను,
నీ నవ్వులు చిన్నరివై నువ్వు ఆడే ఆటలు చూసేందుకు…!
మళ్లీ అంతా ప్రశాంతంగా అయ్యాక,
నిన్ను ప్రపంచం నలు దిశలు తీసుకువెళతాను.
నీ చేతిని అలా పట్టుకొని,
ఆకాశం సముద్రాన్ని తాకడం చూస్తాను,
ఆకాశంలో చందమామ నక్షత్రాలు ఇచ్చే అందాన్ని చూస్తాను,
ఎడారిలో వచ్చే ఎండమావిని చూస్తాను,
నందనవనంలో ఉండే పువ్వులను చూస్తాను,
నీతో ఉంటూ,
నిన్ను నీలా ఉండనిస్తూ,
జీవితం మొత్తం నిన్ను చూస్తూ ఉంటాను….!