Home Musings మన ప్రేమ లేఖ

మన ప్రేమ లేఖ

By Ega Chaitanya Kumar

ఏ రోజు వెళ్లనిది.. ఆ రోజు అనుకోకుండా అటు పక్క వెళ్ళవలసి వచ్చింది.. అపుడే కనిపించింది ఓ కాగితం గాలిలో చక్కర్లు కొడుతూ. చక్కున.. గాలికి ఆ కాగితం నా వైపుకి ఎగిరింది. ఏమయ్యుంటుంది అని అందుకుని.. నా చేతితో పట్టుకుని చూడసాగాను. చక్కని అక్షరాలతో ఎర్రటి ఇంక్ తో ఆ కాగితం అంతా నింపి ఉంది. చూస్తేనే తెలుస్తోంది.. ఆ అక్షరాలు ఉత్తి రాతలు కావు, ఏవో జ్ఞాపకాలతో నింపిన పదాలు అని.   అది తీసి చూసే లోపు ఓ అమ్మాయి వచ్చి ఇది నాదే అని అంది. చదువుతా అని అడిగితే బాగోదు. ఏం రాసుంది తెలియలేదు. చూస్తే ఆ అమ్మాయి కళ్ళు అంతా కన్నీళ్ళతో నిండి ఉంది. అసలే ఏమనుకుంటారో అని అనుకుని మరి ఏం చేయలేక ఆ కాగితాన్ని ఆ అమ్మాయి చేతికి ఇచ్చేసా. థాంక్యూ అని చెప్పి తిరిగి వెళ్ళిపోతోంది..

ఏమైంది, ఎందుకు ఏడుస్తోంది, ఆ కాగితం ఏమిటి, అందులో రాతలు ఏంటో అసలు అర్థం కాలేదు. క్షణాల్లో అంతా జరిగిపోయింది.

కొంత దైర్యం కూడకట్టుకుని తన వెనక వెళ్లి.. మీ పేరు ఏంటి, ఏమైంది అని అడిగా..
ఎవరా అన్నట్టు వెనుకకు తిరిగింది. ఆ కళ్ళలో ఓ తెలియని భయం, ఆరాటం, కనిపించాయి.
ఆ కాగితం ఏంటి, అది ఎవరికి రాశారు అని అడిగా.
తన నుండి మౌనం
పరిచయమే ఉంటేనే చెప్పగలరు అంటే, నా పేరు రామ్. మీ పేరు అని అడిగా. చెప్పలేదు..
తీర్చే మార్గం ఉంది అంటే.. వెంట ఉండడానికి నేను సిద్ధం అని అన్నా..
ఓ చిన్న నవ్వు నవ్వింది,ఆ నవ్వులో ఏ మాత్రం సంతోషం లేదు, ఆ నవ్వులో కొంచం భయం ఉంది,ఆమెకి ఏం అనిపించిందో ఏమో,నాకు తన కథ చెప్పాలి అనుకుంది అనుకుంటా,చేతిని అలా ముందుకు చాపుతూ నా పేరు కావ్య అని చెప్పింది,నేను కూడా తనతో చెయ్యి కలిపాను…
ఇద్దరం అలా నడుస్తూ ఉన్నాం,తన ముఖంలో ఎదో భయం,ఎందుకు అని అడగాలి అనిపించింది,ఎందుకు భయపుతున్నారని అడిగా తనని,మళ్లీ మౌనం,చెప్పాలి అనిపిస్తేనే చెప్పండి కావ్య,మీకేం ఇబ్బంది లేదు,నాతో చెప్పొచ్చు,”నాకు భయంగా ఉంది,ఎవరికి ఈ విషయం చెప్పలేను,ఇది నాకు మాత్రం సంబంధించిన విషయం” అంది కావ్య.
“బాధ చెపితే తగ్గుతుంది అంటారు అండి”అని అన్నాను.
“నీకు చెప్తే నా బాధ ఇంకా పెరుగుతుంది అని నా భయం”అంది కావ్య.ఎంటి ఈ అమ్మాయి ఇంత వింతగా మాట్లాడుతుంది అనుకున్నా.
తన మాటల వెనుక ఎదో భయం బెరుకు కోపం ఉన్నాయి అని మాత్రం అర్థం అవ్తుంది, ఎదో ఒకటి చేసి తన బాధ తొలగించాలి అనుకున్నా, “ఏమో చెప్పి చూడు,తగ్గే ఛాన్స్ కూడా ఉందిగా,పెరుగుతుంది అని రూల్ అయితే లేదుగా”అన్నాను.
తను నా వైపు తిరిగింది, “సరే చెప్తాను, కానీ నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి” అని అంది.. సరే అన్నట్టు తల ఊపాను,
“ఎప్పుడైనా అటుగా ఇంటికి వెళ్లే నువ్వు,ఈరోజు ఇటు వైపుగా  ఎందుకు వచ్చావు?” అని అడిగింది
“నాకు గొడవలు అంటే ఇష్టం లేదు,అక్కడ గొడవ జరగటం చూసి ఇటు నుండి మా ఇల్లు దూరం అయినా కూడా ఇటు నుండి వెళ్తున్నా”
ఇంకో ప్రశ్న
“నాతో ఎందుకు మాట్లాడాలి అనుకున్నావ్?”
దీనికి మూడు కారణాలు,ఆ కాగితంలో ఏముందో తెలుసుకోవాలి అని,ఇంకోటి నువ్వు ఏడుస్తూ కనిపించావు,ఇంకోటి నీలో ఎదో తెలియని ప్రత్యేకత ఉంది ,అందుకే నీతో మాట్లాడాలి అనుకున్నా”
“ఇంకొక్క ప్రశ్న, నువ్వు ఎవర్నైనా ప్రేమించేవా??”
లేదు అని సమాధానం ఇచ్చాను,
“ఇప్పుడు ఈ లేఖ చూడు అని ఆ లేఖ నా చేతికి అందించింది”
ఆ లేఖనే చూస్తున్నా,అందులో ఇలా రాసి ఉంది.
చాలా మృదువైన స్వభావం గల మనిషివి నువ్వు, కొంత కాలం గా నిన్ను చూస్తున్నా,నీ పేరు కూడా చాలా బాగుంది,వీధి చివర ఉండే టీ షాపులో నీ స్నేహితుడు పిలుస్తుంటే నీ పేరు విన్నాను,ప్రేమకు నిలువెత్తు రూపంలా‍ అనిపించావు, నీ చుట్టూ అంతా ప్రేమే,అంతా మంచిగా ఉండాలి అనుకుంటూనే ఉంటావు, చిన్న గొడవ కూడా నీకు నచ్చదు,నవ్వించడం మాత్రమే నీకు తెలుసు,అందుకే నీతో ఉండాలి అని,నీ జీవితంలోకి రావాలి అని నా మది ఉరకలు వేస్తుంది,నిన్ను తలుస్తూ ఉంటే నా మదిలోని భావం కవిత్వం అవ్తుంది,ఈ భావం ఇంకా అలాగే దాచాలి అని లేదు, చూసిన కొన్ని రోజుల్లోనే నువ్వు ఇంత నచ్చావు,అందుకే నీతో కలకాలం ఉండాలి అని ఉంది.
నువ్వు అపుడపుడూ మాట్లాడిన మాటల్లోనే నాకు ఇంత అర్థం అయ్యావు, ఒంటరిగా ఇక్కడికి వచ్చిన నాకు మళ్ళీ ఒంటరిగా వెళ్ళాలి అని లేదు,నీ తోడుగానే వెళ్ళాలి అని ఉంది
నా మదిలో ఉన్న ప్రేమను నీకు వ్యక్తపరచాలి అని ఉంది,నేను నిన్ను ప్రేమిస్తున్నాను రామ్
ఇట్లు నీ సీత అవ్వాలి అనుకునే కావ్య”
ఆ లేఖలో ఉంది నా గురించే అని తెలుసుకున్న నాకు కంట్లో ఆనంద బాష్పాలు,నన్ను అంతా బాగా అర్థం చేసుకుంది ఆమె అనే సంతోషంలో ఉన్నాను.

“నాకు కూడా నువ్వంటే ఇష్టమే కావ్య,చూసిన తొలి చూపులోనే నచ్చావ్ కాబట్టే నీ బాధ ఏంటో అని తెలుసుకోవాలి అనుకున్నా,నీ కంట్లో నీరు చూడలేక నీ బాధ తీర్చాలి అనుకున్నా,నీతో ఉండాలి అనిపించే నీ వెంట నడిచాను,
నీతో మాట్లాడాలి అనిపించే నీ కథ అడిగాను,నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావ్య”

ఇద్దరు ఒకరి కన్నులోకి ఇంకొకరు చూస్తూ ఉన్నారు…

అలా చూస్తూ చూస్తూ ఒక్కసారిగా కౌగిలించుకున్నారు…

అలా కొంత సమయం తరువాత “ఇంతకీ ఎందుకు ఏడ్చావు కావ్య” అని అడిగాను..

“ఎడవలేదు కంగారు పడ్డాను,ఆ కంగారు వల్ల కాటుక చెరిగి కంట్లోకి వెళ్ళింది,అందుకే కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి”అని చెప్పింది కావ్య

“ఆ కాటుకే మనల్ని కలిపింది” అని నవ్వాను..

“ఆ కాటుక ఒక్కటే కాదు,ఈ లేఖ ఆ గొడవ అన్ని కలిసే మనల్ని ఒక్కటి చేశాయి అంది కావ్య
“అంటే?” అని అడిగాను
ఆ గొడవ అక్కడ జరిగేలా చేసింది నేనే,ఈ కాగితం నీ ముందు పడి ఆగేలా చేసింది కూడా నేనే,నువ్వు వస్తావని నాకు తెలుసు రామ్,అందుకే ఆ లేఖ నీ నుండి తీసుకున్నాను,నా ప్రేమ నాకు నీ మీద ఉన్న నమ్మకమే నిజమై మనల్ని ఒక్కటి చేసింది…

Load More Related Articles
Load More By ohmanasa-admin
Load More In Musings

Check Also

ఆత్మహత్య కూడా ఓ హత్యే.

Contributed by Potta Vamsi Krishna …