Home Inspirations మనిషికి మనిషే సాయం

మనిషికి మనిషే సాయం

ప్రపంచం అంతా కరోనా భయం తో..బిక్కు బిక్కు మంటూ బ్రతుకు తుంటే…కొంత మంది వాళ్ళు ధైర్యం గా ఉండటమే కాదు పక్కన వాళ్ళకి కూడా బ్రతికే ధైర్యం ఇస్తున్నారు.మేము ఉన్నాం అంటూ అభయం ఇస్తున్నారు.

అలాంటి ఒక గొప్ప మనిషే Dr.Sampath గారు.
ఈయన కరోనా వచ్చి కోలుకోవడం మాత్రమే కాదు.మూడు సార్లు ప్లాస్మా దానం కూడా చేశారు…

ఆయన ఒక్క ప్లాస్మా దానం మాత్రమే కాదు..
రక్త దానం కి కూడా ప్రతీ సారి ముందు వరసలో ఉంటారు..ఎంతగా అంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 214 సార్లు.

అవును అక్షరాలా 214 సార్లు రక్త దానం చేసి
గిన్నీస్ రికార్డ్ కూడా సాధించారు..

“దైవం మనుష్య రూపేణ” అంటారు కదా..
ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అది నిజం అనిపిస్తుంది.అసలు అది ఇది అని కాదు..ఆయన గురించి..ఆయన చేసే సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే…

కరోనా వేళ..ఆయన తలసీమియా రోగుల కోసం , సరైన సమయం లో రక్తం అందటం కోసం..తన సొంత కార్ నే ఆంబులెన్స్ గా మార్చేశారు…
లాక్ డౌన్ సమయం లో కూడా లేదు కాదు అనకుండా ఆయన ఎందరికో సాయం చేశారు..
Old age homes కి, Orphanages ki అవసరమైన వస్తువులు సమకూర్చారు..
2000 కుటుంబాలకి ఆర్ధికం గా ఆసరా ఇచ్చారు.
అన్నీ ఆయనే స్వయంగా చేస్తారు..
ప్రతీ సారి అంతే చురుగ్గా ఉంటారు..

ఒక్క ఫోన్ చేస్తే చాలు.. నాకు చేతనైన సాయం నేను చేస్తా అని ప్రతీ సారి చెప్తూ అంతే దైర్యం ఇస్తారు…వికలాంగులు కి, వృద్దులకి ఇలా అందరకీ తోచినంత సాయం చేస్తూ తృప్తిగా బ్రతికేస్తూ తన లాంటి వాళ్ళు అందరకీ ఒక స్పూర్తి ప్రదాత గా సాగిపోతున్నారు.

ఆయన చేసే సాయం కి full stop లేదు,

Just comma మాత్రమే ఉంది.

ఇలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు నిజంగా ఎందరికో Inspiration

Hats off you Sir

https://www.facebook.com/sampath.kumar.902604

Load More Related Articles
Load More By ohmanasa-admin
Load More In Inspirations