
Contributed by Rakesh Manu
ఇద్దరి మధ్య ప్రేమ……
చేసేను ఏదో మాయ……
వాళ్ళ కథ ఇదే……
అనూహ్యంగా వచ్చింది..
పక్కింట్లో ఉంటుంది..
నన్ను ఆకర్షించింది..
నోరు విప్పింది..
ప్రేమను తెలిపింది..
మనసు చూపింది..
ప్రేమలో పడేసింది..
నన్ను మనువాడింది..
నాలో కలిసింది..
జీవితం అందించింది..
సొగసు పంచింది..
కాలం గడిచింది..
నాపై సంధించింది..
గొడవ పెట్టింది..
కమ్మగా తిట్టింది..
మెత్తగా కొట్టింది..
నాపై అలిగింది..
సహనం విడిచింది..
కన్ను అదిరింది..
కీడు సంకించింది..
చెయ్యి వదిలింది..
మనసు విరిగింది..
పుట్టింటికి వెళ్లింది..
తను ఆలోచించింది..
తిరిగి వచ్చింది..
మనస్సు విప్పింది..
అర్థం చేసుకుంది..
చెయ్యి వధలనంది..
ముద్దులలో తేల్చింది..
ప్రేమలో ముంచింది..
ప్రేమలో మునిగింది..
జీవితం సాగించింది..
సార్థకం చేసుకుంది..
ఒకరిలో ఒకరం..
ఇద్దరం ఒకరం..
శివుని పార్వతిలం..
జీవనం సాగిధ్ధాం..
కలిసి బ్రతుకుధాం..
ప్రేమ అనంతం❤️