
By Hari Atthaluri
మనమంతా ఒకేలా ఉన్నామా ?
ఒకేలా ఆలోచిస్తున్నామా !! లేదు కదా !!
ఎవరి way వాళ్ళది..
ఎవరి లైఫ్ వాళ్ళది…
ఎవరి పరిస్థితులు వాళ్ళవి..
ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి..
మరి ఇలాంటి మనసుల మద్య పుట్టే ప్రేమ మాత్రం ఒకేలా ఎలా ఉంటుంది !!!
ఒకరకి ఆ ప్రేమ చెప్పటం బాగా వస్తె,
ఇంకొకరికి ఆ ప్రేమ చూపించటం బాగా వస్తుంది…
ప్రతీ దానిలో ఒకరి ప్రేమ క్లియర్ గా తెలుస్తోంది..
ఇంకొకరి ప్రేమ అవసరం ఐనప్పుడే బయటకు వస్తుంది…
ప్రతి చోట ప్రేమ ఉంటుంది…
కానీ ఆ ప్రేమ ప్రతి సారి ఒకేలా అనిపించదు. కనిపించదు…
ఒకరి ప్రేమ మణిరత్నం గారి “సఖి” అంత స్వీట్ గా అనిపిస్తే
ఇంకొకరి ప్రేమ అదే మణిరత్నం గారు తీసిన “చెలియా” అంత చెత్తలా అనిపిస్తుంది..
“చెలియా” లో ప్రేమ లేదు అని కాదు…
ఉంది.. ఖచ్చితంగా గా ఉంది..
కానీ ఆ ప్రేమ చూపించే పద్దతి,
ఆ ప్రేమని మనం చూసే పద్దతి రెండూ..
మనం మామూలు గా చూడనవి…కొత్తవి…
అలా అని అసలు అది ప్రేమే కాదు అంటే ఎలా!
అదే మణిరత్నం సర్ తీసిన “యువ” లో..
మెచ్యుర్డ్ లవ్ గా సూర్య ది..
మోడ్రన్ లవ్ గా సిద్ధార్థ్ ది..
మొరటు లవ్ గా మాధవన్ ది..
ఒకే మూవీ లో three shades of love..
వీళ్ళ ముగ్గురి ప్రేమ లో కనిపించే ఇంటెన్సిటీ మారుతుంది కానీ, వాళ్ళ ప్రేమ కాదు..
చావుకి భయపడని ప్రేమ “గీతాంజలి”ది ఐతే..
చావు కి ఎదురు వెళ్లే ప్రేమ “రోజా”ది…
ప్రేమ లేదు అంటూనే చూపించే పిచ్చి ప్రేమ
“ఒకే బంగారం”ది…
శత్రువు మీద కూడా మనకి తెలియకుండా వచ్చే ప్రేమ “విలన్” ది..
మతం చూడని ప్రేమ “బొంబాయి” ది ఐతే…
మనసుకు మాత్రమే సంబంధించిది ప్రేమ అని చెప్పేది “నాయకుడు” ది…
ఇలా love guru ఐన ఒక్క మణిరత్నం సర్ మూవీస్ లోనే..ప్రేమ లో ఇన్ని షేడ్స్ ఉంటే..
ఇంక మనం చూడని..మనకి తెలియని..మనం చూడని షేడ్స్ ఎన్ని ఉంటాయి…???
అలాంటి different shades of love ఉన్న
Best movies list మీ కోసం…
ప్రేమిస్తే..failured love
నిన్ను కోరి..పెళ్లి తర్వాత love..
ఏం మాయ చేసావే..confused love..
తొలి ప్రేమ..one side love…
ఓయ్.. ఓడిపోని love..
ఏటో వెళ్లిపోయింది మనసు.. phases of love
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. matured love..
ఆరెంజ్.. finding love..
ఆర్య..feeling of love..
బొమ్మరిల్లు.. understanding in love..
అర్జున్ రెడ్డి..Egoic love..
ఖుషీ..cute clashes in love..
సుస్వాగతం.. patience in love..
అందాల రాక్షసి..pain in love..
గోదావరి.. girls love..
నిన్నే పెళ్ళాడతా..teasing love..
నువ్వే కావాలి..new age love..
మనసంతా నువ్వే…waiting for love..
ఈగ..true love…
వర్షం.. misunderstanding in love..
నువ్వు వస్తా అంటే నేను వద్దు అంటానా..proving love..
సూర్య s/o కృష్ణన్…depression in love..
రాజా రాణి….love after love fail..
7/g బృందావన్ కాలనీ..madness in love.
ఇలా ఇంకెన్నో ఉన్నాయి….
ప్రతి లవ్ లో మీరు అర్థం చేసుకోలేని,
మీకు తెలియని షేడ్స్ కొన్ని ఉంటాయి…
ఒకరు మనల్ని ఎలా ప్రేమిస్తారో,
అలాగే రిసీవ్ చేసుకోండి..
నాకు తెలిసి ఒకరి ప్రేమ ని ఇంకొకరి తో compare చేసి చూడటం మహా పాపం…
ఎదో ఒక రోజు..
మీది కూడా ఓ అద్భుతమైన ప్రేమ అని మీకే అర్థం అవుతుంది, పక్కన వాళ్ళకి కూడా తెలుస్తుంది..