Home Musings ఈ తీరం

ఈ తీరం

Contributed by Keerthi

గాయం నీదైనా, బాధ నాదే.
మోసం నీదైనా, వెర్రితనం నాదే.
ప్రేమ నీదైనా, ఒంటరితనం నాదే.
కథ నీదైనా, సారాంశం నాదే.
త్రోవ నీదైనా, గమ్యం నాదే.

మదిలో భావాలకు మాటని ఆపేసిన వేళ,
కంటిపాప ఆపే అవకాశం లేకుండా కన్నీరు కురిసిన వేళ,
మొలకెత్తిన మది ఆశని విధి చిదిమేసిన వేళ,
వెలుతురులో కూడా ఒంటరితనం గడిపిన వేళ,

సంతోషానికి దూరం అయిన వేళ,
నాకు నేనే కొత్తగా కనిపించిన వేళ,

కన్నీరు ఆవిరి ఐన వేళ,
ఆలోచనలతో నన్ను నేనే బంధీ చేసిన వేళ,

సముద్రపు లోతు ని చూడలేరు ,
నా జీవితపు వెలుగును వెతకలేరు…

అలిసిన కన్నుని నేనే,
విరిగిన మనసు ని నేనే,
సొమ్మసిల్లిన ప్రాణిని నేనే,
చేజారిన ఆశ ని నేనే,
చెంతకు చేరని సంతోషం నేనే,
చితిలో కాలే కట్టెని నేనే…

సముద్రమనే జీవితంలో..
ఆకాశాన్ని కమ్మేసే కారు మేఘంలా..
నావని ముంచేసే అలలలా..
ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా…..

తీరం చేరాలని చేసే నా ఈ ప్రయత్నంలో,

నను నేను కోల్పోయినా,
అలుపెరుగకుండా సాగుతాను…

Load More Related Articles
Load More By ohmanasa-admin
Load More In Musings

Check Also

ఆత్మహత్య కూడా ఓ హత్యే.

Contributed by Potta Vamsi Krishna …