Home Poetry నాడు – నేడు

నాడు – నేడు

By Ravindra

*నాడు*

పట్టుపరుపులు
పల్లకీమోతలు..
ప్రభువులెందరో
పరిత్యజించిరి..

పర్ణ,ఫలములే
ప్రసాదమనుచూ..
పరమపదంకే
పయనించితిరి..

ప్రీతిపలుకుల
పరులసేవల..
పాతకాలమే
ఫరిడవిల్లినది..

పరాయిమూకల
పీచమణచగా..
పౌరుషమెంతో
ప్రజ్వరిల్లినది..

*నేడు*:-

ప్రదోషకాలపు
ప్రశాంతవేళలో..
పరాన్నభుక్తులు
ప్రభవిస్తున్నవి.

ప్రాభవమ్ముకై
ప్రాకులాడుతూ..
పవిత్రాత్మలే
పతనమైనవి..

ప్రపంచీకరణ
ప్రయాణమ్ములో..
పద్దతులెన్నో
పాతరైనవి..

పైసలవేటలో
పదవులాటలో..
ప్రేమా,ధర్మం
పాడెనెక్కినవి.!!

Load More Related Articles
Load More By ohmanasa-admin
Load More In Poetry

Check Also

ప్రేయసివేమో

Contributed by Durga Prasad Patnana …